అస్తిత్వ వాచకం (కవిత్వం)

'లౌకికత్వం ఈ నేల రక్తం. భిన్నత్వం ఈ నేెల సౌరభం. ఎవడి ఆకలి వాడిదనట్టు, ఎవరి ఆహారం వాడిదన్నట్టు, ఎవడి భాష వాడిది. భాష నా అస్తిత్వవాచకం' అంటారు కవి బాల సుధాకర్‌. ఇందులోనివి కొన్ని నిర్మొహమాటపు కవితలు. ఉత్తరాంధ్ర అస్తిత్వాన్ని చాటే అక్షర మాలికలు. భళ్లున బయటకు రాలేక మహిళల అంతరంగాల గోడలను అంటిపెట్టుకొని తరతరాలుగా దాగున్న భావోద్వేేగాలు. చక్కని శైలితో సాగే సుధాకర్‌ కవితలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ఈ కవి ఇప్పటికే మూడు కవితా సంపుటాలు వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం పొందారు.

బాలసుధాకర్‌
వెల: 
రూ 150
పేజీలు: 
136
ప్రతులకు: 
96764 93680