నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రారంభ సభ

సమాజ మార్పునకు కవులు, రచయితలు క షి చేయాలని పలువురు సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు పేర్కొన్నారు. విజయవాడలో బందరురోడ్డులోని ఠాగూర్‌ గ్రంథాలయంలో సెప్టెంబర్‌ 9న నిర్వహించిన నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకల్లో వారు మాట్లాడారు. జి.లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ చేతికి మట్టి అంటకుండా పంట పండించడం ఎలా సాధ్యం కాదో.. ఎవరి మనసును నొప్పించకుండా, ఎవరో ఒకరి పక్షపాతం వహించకుండా మంచి సాహిత్యం రాదని అన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన సమాజంలో కవులు పీడితుల పక్షాన ఉండాలని కోరారు. అలజడి, ఆందోళన నుంచి అక్షరాలు బయటకు రావాలని కవులకు ఆయన సూచించారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రచయితల సంఘం నవ్యాంధ్రగా సాగాలని ఆకాంక్షించారు. ప్రగతిశీల భావజాలాన్ని, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా సంఘం అడుగులు వేయాలన్నారు. అక్షరం ఆయుధంగా, ఆశయ కేతనంగా ముందుకు సాగాలని సూచించారు. ఆ సంఘం అధ్యక్షులు బిక్కి క ష్ణ మాట్లాడుతూ ఇటువంటి వర్క్‌షాప్‌ పునాదులపై గొప్ప కవులను తయారు చేస్తామన్నారు. డాక్టర్‌ ఆర్‌.రంగారావు మాట్లాడుతూ కవిత్వం వ్యక్తీకరణలో ద ష్టికోణంలో మార్పుతెచ్చే దిశగా కవులను తయారు చేయడంలోనే సంఘం గొప్పతనం ఉందన్నారు. ఎపిజెఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కష్ణాంజనేయులు మాట్లాడుతూ కవులు తమ రచనల ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన నిలిచేందుకు ఈ సంఘం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో రచయితలు చంద్రశేఖర్‌ ఆజాద్‌, శ్రీరామ కవచం సాగర్‌, కె.శాంతారావు, ఎంవిజె.భువనేశ్వరరావు, చిన్ని నారాయణరావు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు, రచయితలు  పాల్గొన్నారు.