ప్రజా వైద్యురాలు డా.మోటూరు ఉష

ప్రజా వైద్యురాలు డాక్టరు మోటూరు ఉష కమ్యూనిస్టు నాయకులు మోటూరు హనుమంతరావు, ఉదయం గార్ల కుమార్తె. అమ్మానాన్నల బాటలోనే ప్రజా పక్షపాతిగా,సామాజిక సేవకురాలి గా నడిచారు. అనేకమంది కమ్యూనిస్టు నేతల పిల్లల్లాగానే ఆమె కష్టాల మధ్య పెరిగారు. కష్టజీవుల సేవకు అంకితమై, ప్రజా వైద్యశాల ద్వారా ఎందరికో వైద్యసేవలు అందించారు. ప్రజా, మహిళా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. 2018 జులై 2వ తేదీన కన్నుమూశారు. ఆమెను స్మరిస్తూ మిత్రులు, హితులు రాసిన జ్ఞాపకాల సంకలనం ఇది.

సంస్మరణ వ్యాసాల సంకలనం
వెల: 
రూ 50
పేజీలు: 
112
ప్రతులకు: 
94900 98620