సాహిత్య ప్రస్థానం, సెప్టెంబరు 2022

ఈ సంచికలో ...

కథలు
మూసుకుపోయిన దారి : కరీమ్‌
ఆకలే అన్నీ నేర్పిస్తుంది : ప్రొ. ఈదర శ్రీనివాస రెడ్డి
ఆకాశానికి చక్రాలు : జి.వెంకటకృష్ణ
నలుపు : రాచపూడి రమేష్‌
తీర్పు : డా. ఆల్తి మోహనరావు

కవితలు
సముద్రాలు ఘోషిస్తూనే ఉంటాయి : బిక్కి కృష్ణ
శ్రమగీతం : గండ్రేటి శ్రీనివాసరావు
ప్రశ్నోపషనిత్తు : డా. బండి సత్యనారాయణ
వజ్ర సంకల్పం : బంగార్రాజు కంఠ
కలల తీరం : పద్మావతి రాంభక్త

మూసుకుపోయిన దారి

కరీమ్‌
ఆదివారం అక్కయ్య వాళ్లింట్లో హకీకా (పుట్టెంట్రుకలు) కార్యక్రమం. చాల్రోజుల తర్వాత ఊరికొచ్చాను. అంతకు ముందు అడపా దడపా వచ్చినా అలా వచ్చి యిలా వెళ్ళి పోవడమే. తీరుబడిగా ఊర్లో ఉండింది లేదు. చుట్టాల్తో గడిపింది లేదు. స్నేహితుల్ని కలిసింది లేదు.
ఏళ్ల తరబడి పరాయి రాష్ట్రాల్లో ఉద్యోగం. పుట్టి, పెరిగిన ఊరితో ఏదో తెలీని పరాయితనం. బతుకు యారత్రికమై మనసు సున్నితత్వాన్ని కోల్పోయింది. ఈ మధ్య ఊరు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నిద్రలో మెలకువ వస్తే ఊర్లో నేను నడయాడిన దార్లు, కలిసి తిరిగిన స్నేహితులు గుర్తుకొస్తున్నారు. ఊరెళ్ళి నాల్రోజులు గడపాలి. ఊరి దారుల్లో తనివితీరా తిరగాలి. తెగిన బంధాలను కలుపుతూ కొత్త ముళ్ళు వేయాలి. స్నేహితుల్ని కలసి జ్ఞాపకాల ఆల్బమ్‌ తిరగేయాలి. మొద్దుబారిన మనసుకు మార్ధవత నేర్పాలి.

ప్రాచీన పట్టణాలు తూర్పు గోదావరి జిల్లా ఒక పరిశీలన

వేపకాయల ప్రసాద్‌
94907 12967

ఇప్పుడు లేని మనుషుల స్మ ృతులను, వారు జీవించిన నాటి సంగతులను, సంస్క ృతులను, ఇప్పటి మట్టి పొరలలోంచి, వారు నిర్మించిన కట్టడాల శిథిలాలలోంచి, వారు సంతరించిన సాహిత్యం తదితరాల నుంచి వెలికి తీయాలని, వాటిపై వెలుగులు ప్రసరింపజేయాలని తపిస్తాడు చరిత్రకారుడు. చరిత్ర పరిశోధన ట్రీట్మెంట్‌ లేని అడిక్షన్‌. ఆ అడిక్షన్లో నుంచి చరిత్రకారుడు పుట్టుకొస్తాడు. ఆయా రాజవంశాల మీద సాగినంత లోతైన పరిశోధన మనదేశంలో స్థానిక చరిత్రల మీద జరగలేదు.

ఈ కవి చాలా ఆశ పెడుతున్నాడు

ప్రసాదమూర్తి
84998 66699

పువ్వు పట్టగానే పరిమళిస్తుందంటారు. కవి పుట్టగానే లోకాన్ని వేల కళ్ళతో పలకరిస్తాడు. కవి పుట్టడం అంటే అతను పుస్తకంగా లోకంలోకి వచ్చిన మొదటి విశేషమే. రానున్న కాలంలో తాను రాల్చే అగ్నిపూల రేకుల పరిమళాలు ఆ తొలి పుస్తకానికి తోరణాలవుతాయి. సాంబమూర్తి లండ మొదటి కవితా సంపుటి 'గాజు రెక్కల తూనీగ'. తాను ముందు ముందు మరిన్ని రెక్కలతో మన చుట్టూ సుగంధాలు కురిపిస్తూ ప్రత్యక్షమవుతానని వాగ్దానం చేసినట్టు ఆ పుస్తకం మనకు మాటి మాటికీ చెప్తుంది.

రేలపూలు కథల్లో గిరిజన జీవన చిత్రణ

డాక్టర్‌ వి.వింధ్యవాసినీ దేవి
సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూలు
నాగరిక సమాజానికి దూరంగా కొండకోనల్లో నివసిస్తూ, నాగరిక జీవనవిధానానికి సమాంతరంగా ప్రత్యామ్నాయ సంస్కృతి సంప్రదాయాలతో, ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నారు గిరిజనులు. ఆదివాసీలు, వనవాసీలు, అడవిబిడ్డలు, బంజారాలు, లంబాడీలు పలు పేర్లతో పిలవబడే వీరు, దేశవ్యాప్తంగా సుమారు 700 ఉప జాతులుగా, 11 కోట్ల జనభా కలిగి ఉన్నారు. గిరిజనుల జీవన విధానాలను చిత్రిస్తూ, వారి జీవనపార్శ్వాలను తడిమిచూపుతూ ఎందరో సాహితీవేత్తలు రచనలు వెలువరించారు. వెలువరిస్తున్నారు.

చీకటికి వెలుగు నిప్పు

అనిల్‌ డ్యాని
97033 36688

సీనియర్‌ కవి, జర్నలిస్ట్‌, సామాజిక అంశాల మీద తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ప్రసాద మూర్తి ఇటీవల యుద్ధమే శాంతి అనే దీర్ఘ కవితని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ ద్వారా వెలువరించారు. ఈమధ్య కాలంలో విరివిగా కవితా సంపుటులు తీసుకు వస్తూ వర్తమానపు సంఘటనలకు తనదైన భాష్యం చెబుతున్న కవిగా మనం ప్రసాద మూర్తిని చూడొచ్చు.

ఆకాశానికి చక్రాలు

జి.వెంకటకృష్ణ
కిచెన్‌ కిటికీ లోనుండి బయటకి చూస్తోంది సరోజా. బయట చెట్టు కింద రోహిత్‌ మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఇంటిముందర రెండు రోడ్ల కూడలి ఒక వైపు మూలలో పెద్ద చింతచెట్టు. అదొక.. అడ్డా. నాలుగైదు బైకులు ఆపి వాటిమీద కూర్చొనీ, వెల్లాకిలా పడుకొనీ, వాటికి ఆనుకొని నిలబడీ, రకరకాల భంగిమలలో పిల్లలు (వాళ్లని పిల్లలు అనకూడదేమో) నిజానికి ఎదుగుతున్న, ఎదిగిన వాళ్లు. అంతా తొమ్మిదీ పదీ తరగతులవాళ్లై వుంటారు. వాళ్ల మధ్యా తన కొడుకు దున్నల మధ్యా తిరుగులాడుతున్న లేగదూడలా కన్పించాడు, ఆ తల్లి కళ్లకు. ఆ బైకుల మీద కూర్చున్న వాళ్లను చూస్తుంటే, నడుం నుంచి కింద భాగం కనపడక, కేవలం శరీరానికి చక్రాలు మొలిచిన వింత జీవుల లాగానూ సరోజా కంటికి కన్పిస్తున్నారు. వాళ్లనలా చూస్తుంటే మధ్యాహ్నం పగటి నిద్రలో వచ్చిన కల యింకొంచెం కలవరపెడుతోంది .

సామాన్యుల హృదయ ఘోషకు గొంతునిచ్చిన కవిత్వం

డాక్టర్‌ కె.జి.వేణు
98480 70084

ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. కవిత్వమంటే ఒక అనుభూతి, ఒక రసానుభూతి. కవిత్వమంటే మేథస్సు చేసే అద్భుతమైన ఒక సాహసం. మనిషి అభివ్యక్తీకరణకు కవిత్వాన్ని మించిన సాధనం మరొకటి లేదు. మామూలుగా మనిషి ఊపిరికి వాసన ఉండదు. కాని కవి రాసిన కవిత్వానికి ఒక పరిమళం ఉంటుంది. ఆ పరిమళం ప్రజల పక్షాన రాసే కవిత్వంలో మరింతగా గుబాళిస్తుంది. కవిత్వం రాయటానికి కాగితాలే కాదు, నిబద్ధత ఎంతో అవసరం. ఆలోచనలో నవ్యత, పదాల సంధింపులో నైపుణ్యత, వాస్తవాల చిత్రీకరణలో చిత్తశుద్ధి, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యల పట్ల లోతైన అవగాహన, ఇత్యాది విషయాలు కవిత్వ నిర్మాణంలో ప్రధాన భూమికను పోషిస్తాయి. ఈ అంశాలను బోధించే పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థి 'అవతలివైపుకే..' కవితా సంపుటి సృజనకర్త ఉప్పల అప్పలరాజు.

తీర్పు

డాక్టర్‌ ఆల్తి మోహనరావు
99638 95636

''పిల్లడి మీదొట్టు.. నేనే తప్పూ చెయ్యలేదు. నేను తప్పు సేశానని నువ్వు దీపం ముట్టించు, నేనార్పుతాను''
''ఆ: నా కొడుకుని మాపేనవు సాలదా.. ఆ గుంటడ్ని కూడా బతకనివ్వా ఇంకా..''
''ఆలు మంచోలు కాదు.. ఆలకివ్వకు పిల్లనని సెవులిల్లు కట్టుకోని సెప్పినారు. నా సేతుల్తో నేనే పిల్ల జీవితాన్ని మాపేసినానర్రో'' సుగుణ తల్లి గోలందుకుంది.
''అప్పుడివ్వడం మానీలేపోనావా... నాకొడుక్కి ఇప్పుడీ తిప్పలు తప్పును..'' గొడవకు సిద్ధమైంది సుగుణ అత్త. వాళ్ళ ఆవేశకావేశాలు పెరిగి జుత్తులందుకోవడానికి తయారై పోతుంటే 'ఆగండహే' అని గదమాయించి, సుగుణ భర్త రామారావును గట్టిగా నిలేశాను 'నీ మాటేట్రా' అని.

రావిశాస్త్రి రుక్కులు మార్కి ్సస్టు దృక్పథం

ఆచార్య వెలమల సిమ్మన్న
94406 41617

'కాదేది కవితకనర్హం' అంటూ శ్రీశ్రీ పేర్కొన్న కుక్కపిల్ల, అగ్గిపుల్లలను శీర్షికలుగా తీసుకొని రాసిన కథలు అభ్యుదయ వాదంలో వచ్చిన ఒక మార్గానికి ప్రతీకలు. అసలు రావిశాస్త్రే అభ్యుదయ విస్ఫోటనకు ఒక కేతనం'
- మహీధర రామమోహనరావు
రాచకొండ విశ్వనాధ శాస్త్రి తన కథలూ, నవళ్లతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. చీకటి కోణపు నిజ జీవితాల్ని వున్నది వున్నట్లు చిత్రీకరించిన సహజ కథకుడు ఆయన. రావిశాస్త్రి కథలను కలంతో రాయలేదు, హృదయంతో రాశారు. దోపిడికి గురవుతున్న బడుగు వర్గాల జీవితాల్ని మార్కి ్సస్టు దృక్పథంతో రాసిన మహా మేధావి రావిశాస్త్రి. ఇతివృత్తంలో, భావనలో, భాషలో, శైలిలో, శిల్పంలో వారికి వారే సాటి. పీడిత, తాడిత, శ్రామిక ప్రజల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక న్యాయవాది వీరు. పేదల పక్షపాతి.

స్వాతంత్య్ర ఫలాల కోసం ... గొంతెత్తిన అక్షరం

సత్యాజీ
94900 99167

కవులూ, రచయితలూ తాము జీవించిన కాలాన్ని తమ తమ రచనల్లో ప్రతిబింబిస్తారు. తాము శ్వాసించిన సేచ్ఛనీ, స్వాతంత్య్రాన్ని తమ తమ గొంతుల్లో ప్రతిధ్వనిస్తారు. తాము చూసిన, చూస్తున్న సమాజాన్ని తాము సృష్టించే సాహిత్యంలో పునఃప్రతిష్టిస్తారు. మన దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్నట్టు తరుణంలో .. మన కవులు ఏమనుకుంటు న్నారు? స్వాతంత్య్ర భారతం ఎలా ఉందని భావిస్తున్నారు? కవుల మనోభావాలను తెలుసుకొని, కవిత్వంగా నమోదు చేయాలని భావించింది సాహితీ స్రవంతి. దానికి ఆచరణాత్మక రూపం ఈనెల 13వ తేదీన విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర కవనం, దానికిముందు నడిపిన '75 ఏళ్ల స్వాతంత్య్ర భారతం - సాహిత్యం' సదస్సు.