'సూత రంగన్థలి' పరిచయ సభ'

  సమాజంలో అనేక రుగ్మతలు, సాంఘిక దురాచారాలకు కారణం పురాణ సాహిత్య భావజాలమే కారణమని ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌, డాక్టర్‌  డి.విజయభాస్కార్‌ అన్నారు. అయన రాసిన సూత రంగస్థలి' పుస్తక పరిచయ కార్యక్రమం ఆగస్టు 18న విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో  జరిగింది. సాహితీ స్రవంతి, జాషువా సాంస్కృతిక వేదిక, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయులు పరిపాలించినా, బ్రిటీష్‌వాళ్లు ఏలినా భారతీయ సమాజంలో అట్టడుగు వర్గాల జీవితాల్లో పెద్ద మార్పు లేదన్నారు.. సాహితీవేత్త గమ్మా సాంబశివరావు మట్లాడుతూ ఎంతో పరిశోధన చేసి తరువాత సూత రంగస్థలి పుస్తకం రాసినట్లు ఉందన్నారు. రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావు మాట్లాడితూ నాటకం అనేది మానవ జీవన గమనానికి ప్రయోజనకరమైన మార్గాన్ని సూచిస్తుందన్నారు. ఎం.బి. విజ్ఞానకేంద్రం ప్రతినిధి వై.సిద్ధయ్య మాట్లాడుతూ మానవుల ఆనందవిషాదాల క్రమ బద్ధమైన వ్యక్తీకరణ కళ అని పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి బాధ్యులు అనిల్‌, ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమి గోళ్ల నారాయణరావు సభాధ్యక్షత వహించిన రచయిత్రి శాంతిశ్రీ, జి.నారాయణ, జి.రంగారెడ్డి, ప్రముఖ కవి ఖాదర్‌మొహిద్దీన్‌ తదితరులు మాట్లాడారు.