విజయవాడ రామరాజ్యనగర్‌లో ఉగాది కవి సమ్మేళనం

విజయవాడలోని విద్యాధరపురం రామరాజ్యనగర్‌లో వి.వి. రాజు అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయ ప్రాంగణంలో జరిగినఉగాది జనకవనంలో ప్రసంగిస్తున్న మాజీ ఎం.ఎల్‌.సి. ఎం.వి.ఎస్‌. శర్మ.విజయవాడ విద్యాధరపురంలోని రామరాజ్యనగర్‌లో వి.వి.రాజు స్మారక అలూర్లి సీతారామరాజు గ్రంథాలయం, సాహితీస్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది రోజు సాయంత్రం ఉగాది ఉత్సవం, కవి సమ్మేళనం జరిగాయి. డా|| రావెళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అనిల్‌ డ్యాని, యామిని కోడె, కట్టా సిద్ధార్థ, కె.ఎక్స్‌ రాజు, బ్రౌన్‌ తమ స్వీయ కవితలు వినిపించారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌,  గ్రంథాలయ కార్యదర్శి అనిల్‌, బాధ్యులు డా. రాజు, శేషుమణి, సాహితీస్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్యరంజన్‌, గుండు నారాయణ, శ్రీరాములు, రామరాజ్య నగర్‌ నివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.