వైజాగ్‌ ఫెస్ట్‌ 2017 కథల, కవితల పోటీ పోస్టర్‌ విడుదల

వైజాగ్‌ ఫెస్ట్‌ 2017 డిశెంబరు 1 నుండి 10 వరకు జరగనున్న సందర్భంగా కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులకు, రచయితలకు రెండు విభాగాలుగా కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు సాహితీస్రవంతి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎ.వి. రమణారావు తెలిపారు. అక్టోబర్‌4న విశాఖపట్నంలోని సీతమ్మధారలో వైజాగ్‌ఫెస్ట్‌ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేసి పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కారక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌, రచయిత్రి అయ్యగారి సీతారత్నం,  విరియాల గౌతమ్‌, అరసం నాయకులు అనంతరావు, సాహితీస్రవంతి విశాఖపట్నం ప్రధాన కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు,  నాగరాజు, యువరచయిత్రి పరిమళ తదితరులు పాల్గొన్నారు.